పోలవరంపై తాజా నివేదిక ఇవ్వండి : ఎపికి సుప్రీం ఆదేశాలు!!

0
100

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగింది. బచావత్‌ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు డిజైన్‌ ను మార్చారని ఒడిశా వాదిస్తూ.. ప్రాజెక్టు ముంపుపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని తెలిపింది. మరోవైపు ప్రాజెక్టుపై తమకు అభ్యంతరంలేదంటూ తెలంగాణ ప్రభుత్వం మణుగూరు ప్లాంట్‌, గిరిజనులకు ముంపు లేకుండా చూడాలని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ.. ప్రాజెక్టు ఎప్పటిలాగే కొనసాగుతుందని, మార్పులు లేవని కోర్టుకు వెల్లడించారు. సుప్రీం కోర్టు తన ఆదేశాలను జారీచేస్తూ.. పోలవరం ప్రభావిత రాష్ట్రాల అభ్యంతరాలు, సందేహాలు దూరం చేయాల్సిన బాధ్యత ఎపి ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. పూర్తి వివరాలతో ప్రాజెక్టు తాజా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువును కోర్టు నిర్దేశించింది. విచారణను కూడా రెండు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

SHARE

LEAVE A REPLY