అవతార్ సీక్వెల్ నుండి ఫోటోలు లీక్..!!

0
77

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-ఇప్పుడిప్పుడే కరోనా భయాన్ని వీడి ఒక్కొక్కరు సినిమా షూటింగ్ లను ప్రారంభిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మందితో పలు షూటింగ్ లు జరుగుతున్నాయి. ఇకపోతే అద్భుత దృశ్యకావ్యం హాలీవుడ్ మూవీ అవతార్ కి నాలుగు సీక్వెల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకులను అలరించనున్నాయట. స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ కి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు. కోవిడ్ సమయంలో కూడా సినిమా షూటింగ్ లొకేషన్ నుండి పలు ఫోటోలు లీక్ అవ్వడం ఆ చిత్ర దర్శక..నిర్మాతలను కలవరపెడుతున్నాయి. జేమ్స్ కామెరాన్ అవతార్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనే లేదు. తాజా సీక్వెల్ నుండి కొత్త సెట్ ఫోటోలు వెబ్ ని హీటెక్కిస్తున్నాయి. వీటిలో పండోరాపై మానవులు పోరాడుతున్న దృశ్యాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రశాంతమైన గ్రహం పై అరివీర భయంకర పోరాటానికి సంబంధించిన షూటింగ్ చేసారట. 2009 బ్లాక్ బస్టర్ అవతార్ లో పండోరా అద్భుతంగా కనిపించింది. ఇప్పుడు అవతార్ 2 లో అది అత్యంత భారీగా కనిపిస్తుంది.న్యూజిలాండ్ ఆధారిత టెక్నాలజీతో అవతార్ సీక్వెల్ తీసే పని సాగనుందిట.

అసలు అవతార్ చిత్రం విడుదలైన తర్వాత రాబోయే నాలుగు సీక్వెల్స్ మరోసారి చిత్ర నిర్మాణంలో విప్లవాత్మకమైనవిగా కనిపిస్తున్నాయి. సీక్వెల్స్ లో పార్ట్ 2 ప్రారంభించడానికి దర్శకుడికి చాలా సమయం పట్టింది. అతను సిజిఐ వాడకాన్ని నీటి అడుగున ఫుటేజ్ తో చేయాలనుకున్నాడు. ఇటీవల లీకైన ఆన్-సెట్ ఫోటోలు అదే చూపిస్తున్నాయి.

అవతార్ 2 లో కొన్ని ఎగ్జయిట్ చేసే ఉత్తేజకరమైన అండర్ వాటర్ దృశ్యాలు ఉంటాయని అర్థమైంది.ఈ నీటి అడుగున దృశ్యాలతో పాటు.. భూమిపై జరగబోయే కొన్ని సీన్స్ గురించి చెప్పే ఫోటోలు బయటపడ్డాయి. `అవతార్ 2` నిర్మాత జోన్ లాండౌ అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండి వచ్చిన ఒక కొత్త ఫోటో పండోరాపై చాలా భయంకరంగా కనిపించే తుపాకీ వార్ ని చూపిస్తుంది. రాబోయే అవతార్ సినిమాలు అభిమానులు ఊహించలేని రేంజులో ఉంటాయని తెలుస్తోంది.

తాజా ఫోటోలో పండోర ఫైర్ ఫైట్ తో పాటు అభిమానులు 2 వ యూనిట్ డైరెక్టర్ గారెట్ వారెన్ ను స్టంట్మ్యాన్ స్టీవ్ బ్రౌన్ తదుపరి టేక్ కి ముందు కొన్ని సలహాలు ఇవ్వడం కూడా చూడొచ్చు. ఇకపోతే అవతార్ 2 చిత్రం 2022 కి వాయిదా పడింది. దానికి కారణం అవతార్ 2 లో ఎక్కువ భాగం నీటి అడుగున చిత్రీకరించే సన్నివేశాలేనని తెలిపారు కామెరూన్.

SHARE

LEAVE A REPLY