వైఎస్సార్ జయంతికి.. పెంచిన పెన్షన్ల పంపిణీ..!

0
121

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ –ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ సీఎం దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా కడపలోని జమ్మలమడుగులో వైఎస్సార్ పెన్షన్ కానుకను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా.. కిడ్నీ రోగులకు రూ.10 వేలు, వికలాంగులకు రూ.3 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.2,250 పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వెళ్తారు. జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి గండి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకుంటారు.

SHARE

LEAVE A REPLY