పెళ్లింట విషాదం.. డీజే సౌండ్‌కు వరుడు మృతి..!!

0
43

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-వివాహం జరిగిన కొన్ని గంటలు కూడా గడవలేదు. వచ్చిన బంధువుల్లో ఇంకా చాలా మంది ఇళ్లకు కూడా చేరలేదు. ఆ . కానీ ఇంతలోపు శుభకార్యం జరిగిన ఇంట్లో విషాదం నెలకొంది. గుండెపోటుతో పెళ్లి కొడుకు కన్నుమూశాడు. దీంతో అంతవరకు నవ్వుతూ ఉన్న ముఖాల్లో ఆగకుండా కన్నీళ్లు వస్తున్నాయి. ఇక ఆ వధువు బాధ వర్ణనాతీతం. హృదయాలను పిండేస్తోన్న ఈ ఘటన నిజమాబాద్ జిల్లాలో జరిగింది.

బోధన్ పట్టణానికి చెందిన మంగళి గణేష్(25)కు శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. ఊరేగింపులో భాగంగా రాత్రి బారాత్‌ను నిర్వహించారు. అందులో డీజే పాటలను హోరెత్తించారు. ఇక ఆ పాటలను కాసేపు డ్యాన్స్‌ కూడా వేశాడు గణేష్. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే గణేష్ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గుండెలు పగిలేలా ఇరు కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఇక తన కళ్ల ముందే తాను కట్టుకున్నవాడు ప్రాణాలు విడవడం చూసిన ఆ వధువు ఏడుపును ఓదార్చడం అక్కడున్న ఎవ్వరివలనా కావడం లేదు.

SHARE

LEAVE A REPLY