అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి… పవన్‌ కళ్యాణ్…

0
410

Times Of Nellore ( Vijayawada ) -అగ్రిగోల్డ్ సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి ప్రభుత్వంపై గురువారం ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఆయన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులను కలిశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్‌కు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. అయినా బాధితులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ అంశంలో రకరకాల అభియోగాలు ఉన్నాయని, కొందరు ఒత్తిడి చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు.ఉద్ధానానికి, అగ్రిగోల్డ్ అంశానికి సంబంధం లేదన్నారు. ఇదో చిక్కుముడి లాంటిది అని చెప్పారు. డెడ్ లైన్‌లతో దీనిని పరిష్కరించాలనుకోవడం కుదరదని చెప్పారు.

బాధితులు ఆత్మహత్య చేసుకోవడం ఆపాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, అలా చేస్తుందో లేదో తెలియదని చెప్పారు. అసెంబ్లీలో చర్చకు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వంతో మాట్లాడే అంశం బాధితులతో మాట్లాడాక చెబుతానని అన్నారు. శారదా స్కాంలో బాధితులకు రూ.5వేలు ఇచ్చారన్నారు.కేసు కోర్టు పరిధిలో ఉందని, తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించే దిశగా చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని భావించాల్సిన అవసరం లేదని, అయితే డబ్బు తిరిగి చెల్లింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం ముందడుకు వేయకపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ విషయంలో న్యాయవాదుల అభిప్రాయాలను తీసుకుంటానని చెప్పారు.

SHARE

LEAVE A REPLY