పాల ప్యాకెట్‌ కోసం వెళ్లి చిన్నారి మృతి

0
117

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- తూర్పుగోదావరి జిల్లా మండపేటలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. చెప్పు కోసం వెళ్లి చిన్నారి ప్రమాదవశాత్తు చనిపోయింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు స్థానికంగా నివాసముంటున్న పలివెల ప్రసాద్‌, పల్లవి దంపతులకు కుమారుడు, కుమార్తె సూర్యచంద్రకళ ఉన్నారు. పాలప్యాకెట్‌ కోసం వెళ్లిన సూర్యచంద్రకళ(7) తిరిగి వచ్చే సమయంలో ఆమె వేసుకున్న చెప్పు నీటిలో కొట్టుకుపోయింది. దీంతో నీటిప్రవాహానికి తన చెప్పు స్థానికంగా ఉన్న డ్రెయిన్‌లో పడిపోయింది. దాని కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో సూర్యకళ పడిపోయింది. స్థానికులు గుర్తించేలోపే చిన్నారి డ్రెయిన్‌లో పడి చాలాదూరం కొట్టుకుపోయింది. వెంటనే బయటకు తీసి చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పాప మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి వరకు ఆడుకుంటూ తమముందే తిరిగిన చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు సైతం బోరుమని విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY