శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను అభినందించిన మేయర్

0
206

Times of Nellore (Amaravaati) # కోట సునీల్ కుమార్ # –   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ షరీఫ్ కు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అభినందనలు తెలిపారు. రాజధాని అమరావతిలోని శాసనమండలి నూతన భవనంలో గురువారం ఆయనతో మేయర్ మర్యాదపూర్వకంగా భేటీ అయి నూతన పదవీ బాధ్యతల స్వీకరణపై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి, విస్తృత పరిచేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రకటించారు. అందించిన బాధ్యతలను అత్యంత క్రమశిక్షణతో నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతానని షరీఫ్ వెల్లడించారు. చైర్మన్ ను కలిసిన వారిలో జిల్లా టిడిపి సెల్ అధ్యక్షుడు మొయినుద్దీన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మున్వర్ బాషా, బారాషహీద్ దర్గా కమిటీ అధ్యక్షుడు హయత్ బాషా, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ షంషుద్దీన్, నాయకులు సమీర్ తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY