చెన్నూరు సర్పంచ్ పై వేదిక నుంచే ఓటింగ్ పెట్టిన చంద్రబాబు !!

0
901

Times of Nellore ( Gudur ) – ముఖ్యమంత్రి చంద్రబాబు చెన్నూరు జన్మభూమి సభ ఆసక్తికరంగా సాగింది. ఏకంగా గ్రామ సర్పంచ్ పనితీరుపైనే ముఖ్యమంత్రి ఓటింగ్ పెట్టారు. చెన్నూరు గ్రామంలో అంగన్ వాడీ పనితీరును సంభందిత అధికారిణి ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజలకు వివరిస్తుండగా, ఆ నివేదికల్లో ఓ శిశువు మరణించినట్లు చంద్రబాబు గుర్తించారు. వెంటనే కలుగజేసుకొని పురిటి బిడ్డ ఎందుకు చనిపోయాడని వారిని ప్రశ్నించారు. గుండెకు రంధ్రం ఉండటం వల్ల చనిపోయినట్లు అధికారిణి వివరణ ఇచ్చింది. వెంటనే అంగన్ వాడీ ఆయా ఎవరూ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆమె లేచి నిలబడగా ఆమెను కూడా పురిటి బిడ్డ ఎందుకు చనిపోయాడని ప్రశ్నించాడు. ఆమె కూడా అదే సమాధానమిస్తూ అది తమ తప్పిదం వల్ల జరిగింది కాదని, బిడ్డ పుట్టేటప్పుడే అనారోగ్యంతో పుట్టాడని, దాని మూలంగానే చనిపోయాడని సమాధానమిస్తూ, శిశుల సంరక్షణే ముఖ్యంగా పనిచేస్తున్నానని దానికి నిదర్శనం ఆ నివేదికలేనని చెప్పగా, ముఖ్యమంత్రి ఆయాను అభినందించారు.

అదే సమయంలో వేదికపైనే గ్రామ సర్పంచ్ శివకుమార్ ఉండగా ఆయన్ను బిడ్డ ఎందుకు చనిపోయింది, అది మీ దృష్ఠికి వచ్చిందా అని ప్రశ్నించారు. సర్పంచ్ శివకుమార్ స్పందిస్తూ ఆరోగ్యం బాగాలేక చనిపోయాడని సమాధానమిచ్చారు. వేదికపై నుంచే చంద్రబాబు మీ గ్రామ సర్పంచ్ బాగా పనిచేస్తున్నాడా, బాగా పనిచేస్తుంటే చేతులు పైకి ఎత్తండని కోరారు. అయితే ఒక్కరూ కూడా చేతులు పైకి ఎత్తలేదు. దీంతో ముఖ్యమంత్రి చిరునవ్వు నవ్వుతూ నీ పనితీరు పట్ల గ్రామస్తులు అసంతృప్తిగా ఉన్నారు, పనితీసు మెరుగుపర్చుకోవాలని అని సూచించారు. నీ కుటుంబానికే కాదు గ్రామానికి కూడా పెద్ద దిక్కుగా ఉండాలని సూచించారు. దీనికి సర్పంచ్ శివకుమార్ అలాగే నంటూ తలూపారు.

SHARE

LEAVE A REPLY