నూతన సీబీఐ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన నాగేశ్వరరావు

0
49

Times of Nellore (న్యూఢిల్లీ)# కోట సునీల్ కుమార్ # : అలోక్‌ వర్మను సీబీఐ చీఫ్ పదవి నుంచి హైపవర్ కమిటీ తొలగించడంతో అదనపు డైరెకర్ట్ ఎం.నాగేశ్వరరావు కొత్త చీఫ్‌గా శుక్రవారం పగ్గాలు చేపట్టారు. అలోక్‌వర్మపై తీవ్ర అభియోగాలు ఉన్నట్టు సీవీసీ అభిప్రాయపడటాన్ని పరిగణనలోకి తీసుకున్న హైపవర్ కమిటీ అలోక్‌ను గురువారం పదవి నుంచి తొలగించింది. అనంతరం ఆయనను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆ పదవిని చెపట్టేందుకు వర్మ నిరాకరించారు. సర్వీసు నుంచి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు గత మంగళవారం ఇచ్చిన తీర్పుతో అలోక్ వర్మ బుధవారంనాడు సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను హైపవర్ కమిటీకి సుప్రీంకోర్టు అప్పగించింది. హైపవర్ కమిటీ గురువారంనాడు ఆయనను పదవి నుంచి తొలగించడంతో కేవలం ఒకరోజు వ్యవధిలోనే అలోక్‌వర్మ తొలగింపునకు గురైనట్టు అయింది. ఈనెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, కొత్త బాధ్యతలు స్వీకరించకుండా సెలవుపై వెళ్లవచ్చన్న ఊహాగానాలు వెలువడినప్పటికీ ఆయన రాజీనామా చేసేందుకే మొగ్గుచూపారు. గత అక్టోబర్‌లో అలోక్‌వర్మను ప్రభుత్వం సెలవుపై పంపడంతో తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వరరావు నియమితులయ్యారు.

SHARE

LEAVE A REPLY