ఏపీలో మొదలైన కోడి పందాల జోరు.. బెట్టింగుల హోరు.!!

0
93

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు కోళ్ల పందాల జోరు మొదలవుతుంది. ముఖ్యంగా గోదావరి ప్రాంతాల్లోని ప్రజలు వీటిని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఒక బరిలో రెండు కోడి పుంజులు ఢీ అంటే ఢీ అంటూ తలబడుతుంటే.. వచ్చే మజానే వేరుగా ఉంటుంది. ఇక ఈ పందాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పందెంరాయుళ్లు సిద్ధంగా ఉండగా.. వందల కోట్లు ఈ మూడు రోజుల్లో అనేక చేతులు మారనున్నాయి. కోడి పందాలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా.. నిర్వాహకులు మాత్రం ఏమీ పట్టనట్లు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇక ఈ పందాల కోసం ప్రత్యేకంగా పుంజులను రెడీ చేస్తున్నారు. అంతేకాకుండా వాటికి బాదం, జీడిపప్పులు పెట్టి మరీ పెంచుతున్నారు. ఇదిలా ఉండగా ఒక్కో పుంజు రూ.5 వేల నుంచి లక్ష రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. ఆన్లైన్ లో వీటి ఫోటోలను పెట్టి మరీ విక్రయిస్తుండటం ఆనవాయితీగా మారింది. కాగా, కోళ్ల పందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన భీమవరంలో అయితే ఇప్పటికే పొలాల్లో టెంట్లు ఏర్పాటు కాగా.. ఇక పాల్గొంటున్న వారికి కోసం మద్యం, మాంసం రెడీ అవుతున్నాయి. అలాగే బెట్టింగులు జోరు కూడా పెరుగుతోంది. అయితే ఈసారి అమరావతి రాజధాని మార్పు ఆందోళనతో వెల్లువెత్తుతున్న పట్టణాల్లో ఈ ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తోంది.

SHARE

LEAVE A REPLY