మొబైల్ వినియోగ దారులకు టెలికాం సంస్ధల షాక్!!

0
232

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –ఇంత కాలం చౌకగా వచ్చిందని ఇంటన్నెట్ ని విచ్ఛల విడిగా వాడేసారు. ఇంకనుండి మీ జేబులకు చిల్లులు పడటం ఖాయం. సోమవారం అర్ధరాత్రి నుండి ఈ కొత్త ఫ్యాకేజ్ లు అమలులోకి రానున్నాయి.

అయితే ఒడాఫోన్, ఐడియా మొబైల్ కాల్, డేటా చార్జ్ లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. అయితే ఈ పెంపు డిసెంబర్ మూడోతేదీ నుండి అమలు అవుతాయి. అలాగె ఎయిర్ టెల్ సంస్థకూడా ధరల పెంపుల పోటీపడుతుంది. డిసెంబర్ 3 తర్వాత కస్టమర్లు నెలకు కనీసం రూ.49 రీచార్జ్ చేయాల్సి ఉంటుందని వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ప్రకటించాయి. రిలయన్స్ జియో కూడా ఈ నెల 6వ తేదీ నుంచి యూజర్స్ పై చార్జీల భారం వేయనుంది.

ఇదిలా ఉంటే వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.50,922 కోట్ల నష్టాన్ని చవిచూసింది. చరిత్రలో ఏ భారతీయ కంపెనీకి ఇంత భారీ స్థాయిలో త్రైమాసిక నష్టం రాలేదు. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్)పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బకాయిలు చెల్లించడానికి కేటాయించిన నిబంధన కారణంగా సంస్థకు ఈ నష్టం వాటిల్లింది. కాగా, టెలికాం రంగంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉందని, తగిన ఉపశమనం ఇవ్వడానికి కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రీ-పెయిడ్ మొబైల్ వినియోగదారుల చార్జీలు మంగళవారం నుంచి పెరుగుతాయని వొడాఫోన్, ఐడియా ప్రకటించింది. ఈ పెంపు 50 శాతం వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఆయా ప్లాన్ల ఆధారంగా ఈ పెంపు ఉంటుందని పేర్కొంది. ఈ పెంపు ఉంటుందని పేర్కొంది. ఏడాదంతా వర్తించే రూ.999 ప్లాన్ ధర దాదాపు 50% పెరుగుతుండగా, ఇకపై ఇది రూ.1,499కి లభించనున్నది. ఈ ప్లాన్ డాటా వినియోగ పరిమితి 12 జీబీ నుంచి 24 జీబీకి పెంచారుఎయిర్‌టెల్ కూడా నెలవారీ ప్లాన్ రూ.24 నుంచి ప్రారంభం అవుతుంది. డేటాతో కూడిన ప్లాన్ రూ.35 నుంచి ప్రారంభం అవుతోంది. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

SHARE

LEAVE A REPLY