ఎమ్మెల్యే ఆర్కే ధర్నా

0
225

Times of Nellore  (Amaravati)  # కోట సునీల్ కుమార్ #– వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధర్నాకు దిగారు. తాడేపల్లి గూడం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎమ్మెల్యే ఆర్కే ధర్నాకు దిగడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే.. తిరిగి తమ కార్యకర్తలపైనే కేసులుపెట్టడంపై మండిపడ్డారు.

చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన టీడీపీ నాయకులు మీద పోలీసులు ఎలాంటి కేసులు పెట్టలేదని అన్నారు. దెబ్బలు తిన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తల మీద దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై మీద కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబు, లోకేష్ మాటలు విని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

SHARE

LEAVE A REPLY