మైనర్‌ బాలికపై యాసిడ్‌ దాడి…

0
203

Times Of Nellore ( Ongole ) – ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. తన ప్రేమను ఒప్పుకోలేదని మైనర్‌ బాలికపై ఓ వ్యక్తి యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వలేటివారిపాలెంలో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న ఓ మైనర్‌ బాలిక(14)ను అదే ప్రాంతానికి చెందిన అంకయ్య(35) గత కొంత కాలంగా ప్రేమ పేరిట వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక ప్రేమను అంగీకరించకపోవడంతో.. కోపోద్రిక్తుడై ఆమెపై యాసిడ్‌ దాడి చేశాడు. అనంతరం బాలిక పేరు మార్చి పామూరు ఆస్పత్రిలో చేర్చాడు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని నడుముకు కింది భాగం మొత్తం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

SHARE

LEAVE A REPLY