బద్ధకం వీడండి – మంచు లక్ష్మి

0
108

Times of Nellore (Hyd) # కోట సునీల్ కుమార్ # – తెలంగాణలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. కొంతకాలంగా హోరాహోరీగా సాగిన ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకానున్న ఓట్ల పండుగ కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మీ తెలంగాణ ఓటర్లకు ఓ సందేశం ఇచ్చారు. ‘‘మీకు రెండు ఎంపికలు ఉన్నాయి.. ఒకటి మాకు ఈ నాయకుడు కావాలని ఓటు వేయండి.. లేదా మాకు ఈ నాయకుడు అక్కర్లేదని వేయండి. కానీ ఎట్టిపరిస్థితుల్లో ఓటు వేయండి. ఆ హక్కును వినియోగించుకొండి. మీ శక్తిని వినియోగించుకోండి. నేతలు మీ కోసం పని చేసేలా చేయండి. మీరు ఓటు వేస్తేనే.. వాళ్లు మీ కోసం పని చేస్తారు. బద్దకంగా ఉండకండి’’ అంటూ లక్ష్మీ ట్వీట్ చేశారు.

SHARE

LEAVE A REPLY