అదుపు తప్పిన ట్రాక్టర్ : ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

0
132

Times of Nellore (Peda chepyala) #కోట సునీల్ కుమార్ # -ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి ఎస్సై విజయ్‌ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూషణం తన ట్రాక్టర్‌ను సర్వీసింగ్‌ చేయించేందుకు చెప్యాల చౌరస్తాకు బయలుదేరాడు. అదే గ్రామానికి చెందిన మల్లేశం ట్రాక్టర్‌ను నడుపుతుండగా‌ పాండవుల చెరువుకు సంబంధించిన కట్టు కాలువ వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో భూషణానికి తీవ్ర గాయాలు కావటంతో సిద్ధిపేట ప్రబుత్వాసుపత్రికి తరలించారు. మల్లేశం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య రాధిక, 3 నెలల కూతురు వర్ష ఉన్నారు.

SHARE

LEAVE A REPLY