పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పనుల్లో ఒకరు మృతి

0
72

Times of Nellore (Polavaram)  # కోట సునీల్ కుమార్ #– పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే షట్టరింగ్‌ పనులు చేయడానికి వచ్చిన కార్మికుల్లో ఒకరు ప్రమాదవశాత్తు మృతి చెందగా, మరోవ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌ రాష్ట్రం హుసేన్‌బాద్‌ మండలం ఉప్రికోలన్‌ గ్రామానికి చెందిన బీమిలేశ్‌కుమార్‌ రాం(22), సతీశ్‌ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్నారు. సోమవారం ప్రాజెక్టు పనుల్లో భాగంగా స్పిల్‌వే షట్టరింగ్‌ పనులు చేస్తుండగా పైనుంచి ఇనుప రాడ్డు వారిపై పడింది. దీంతో బీమిలేశ్‌కుమార్‌ రాం అక్కడికక్కడే మృతి చెందాడు. సతీశ్‌కు తీవ్రగాయాలవ్వడంతో అతనికి పోలవరం సమాజిక ఆరోగ్యకేంద్రంలో ప్రథమ చికిత్స చేసి, అనంతరం రాజమహేంద్రవరం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీహెచ్‌ఎస్‌ రామచంద్రరావు చెప్పారు.

SHARE

LEAVE A REPLY