రైలు బోగీ టాయ్‌లెట్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

0
173

Times of Nellore (Sicunderabad) # కోట సునీల్ కుమార్ #   – రైలు బోగీలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హౌరా-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. జనరల్‌ బోగీ టాయ్‌లెట్‌లో మృతదేహం ఉన్నట్టు సమాచారం అందడంతో జీఆర్పీ పోలీసులు వెళ్లి చూడగా కిటికీకి ఉరేసుకుని ఉన్నాడు. మృతుడి వయస్సు 40-50 సంవత్సరాలు ఉంటాయని, శరీరంపై సిమెంట్‌ కలర్‌ షర్ట్‌, కాఫీ కలర్‌ ట్రాక్‌ సూట్‌ ఉన్నాయని తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

SHARE

LEAVE A REPLY