ప్రాణం తీసిన ప్రేమ…

0
1017

Times Of Nellore ( Srikalahasti ) – ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడికి పదిహేనేళ్ళు కూడా నిండని ఓ బాలిక సర్వస్వం అర్పించి గర్భం దాల్చింది. తీరా పెళ్ళి చేసుకోమని వేడుకోవడంతో కులం సాకు చూపి ప్రేమికుడు నిరాకరించాడు. దీంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించగా ప్రేమికుడిపై నిర్భయ కేసు పెట్టి జైలుకు పంపారు. అనంతరం ఏం జరిగిందో తెలియలేదు కానీ ఆ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.పోలీసుల కథనం మేరకు… శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ కాలనీకి చెందిన దళిత బాలిక (15) స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తుండేది. టీఎంవీ కండ్రిగకు చెందిన పవనకుమార్‌ (22)తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.ఇద్దరి కులాలూ వేరు కావడంతో వారి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. ఆ బాలిక గర్భం దాల్చిన తనను పెళ్లి చేసుకోవాలని ప్రేమికుడిని కోరినా అతడు ఒప్పుకోకపోవడంతో 15రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమె ఫిర్యాదు మేరకు సీఐ చిన్నగోవిందు పవనకుమార్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయినప్పటికీ తనకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ బాలిక బుధవారం ఇంట్లోనే ఉరి వేసుకుంది.

SHARE

LEAVE A REPLY