లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా టిడిపిలో గుబులు పుట్టిస్తున్న వర్మ

0
635

Times of Nellore ( Bureau Report ) – తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకలు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై వివాదస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ నిర్మించనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం, తెలుగుదేశంపార్టీలో అప్పుడు గుబులు పుట్టిస్తోంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా, టిడిపి సీనియర్ నేతల్లో సినిమా ఎలా ఉంటుందోనని కాస్తంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగు పెట్టినప్పటి నుండి ఆయన చనిపోయే వరకూ జరిగిన యధార్ధ సంఘటనలపై మాత్రమే తాను సినిమా తీయబోతున్నట్లు వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపద్యంలో దానిపై అనేక మంది గుబులు పడుతున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా ప్రవేశించింది, లక్ష్మీ పార్వతిపై ఎన్టీఆర్ అంత ప్రేమ కురిపించడానికి కారణాలు ఏంటి, లక్ష్మీ పార్వతి ప్రవేశం తర్వాత ఎన్టీఆర్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, టిడిపిలో లక్ష్మీ పార్వతి పాత్ర, నిర్ణయాలు, ఎన్టీఆర్ కు తెలియకుండా లక్ష్మీ పార్వతి రాజకీయంగా జరిపిన మంతనాలు, చంద్రబాబుతో సహా, సీనియర్ నేతలకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించడానికి లక్ష్మీ పార్వతి వేసిన వ్యూహాలు, ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం నుండి దించాలని చంద్రబాబుతో సహా నందమూరి కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఎన్టీఆర్ చివరి జీవితం, ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మీ పార్వతి జీవితం అనే అంశాలపై వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిర్మించనున్నారు.

తెర వెనుక జరిగిన అంశాలన్నీ వెండి తెరపై చూపిస్తే చాలా మంది నేతల ముసుగులు తొలగనున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదమూ లేక పోలేదు. తండ్రికి జరిగిన అవమానంలో కుటుంసభ్యులకూ భాగం ఉందన్న అపవాదును ఎన్టీఆర్ కుటుంబ సభ్యులూ మోయకతప్పదేమో. లక్ష్మీపార్వతి ని ఎన్టీఆర్ కు పరిచయం చేసింది, ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడే. ఎన్టీఆర్ కు, లక్ష్మీ పార్వతికి తిరుపతిలో వివాహం జరిగింది. వివాహం తర్వాత వారిద్దరూ తిరుపతి నుండి నేరుగా నెల్లూరుకు వచ్చారు. నెల్లూరులో ప్రస్తుతం ఉన్న ఓ మంత్రి తన నివాసంలోనే ఆ రోజు ఎన్టీఆర్ దంపతులకు బసను ఏర్పాటు చేశారు. వారి వివాహం తర్వాత చంద్రబాబుతో సహా ఇతరులకు ఎన్టీఆర్ వద్ద చాలా వరకూ ప్రాధాన్యం తగ్గింది. దీన్ని జీర్ణించుకోలేని కొందరు, పార్టీ అప్రతిష్టపాలవుతుందని, పార్టీని కాపాడుకోవాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల వద్ద ప్రతిపాదన ఉంచారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అల్లుళ్లు, ఎన్టీఆర్ ను అన్నగా భావించే మరో కీలక వ్యక్తి అందరూ కలిసి వైశ్రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేల క్యాంపును ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్టీఆర్ అక్కడకు వెళ్లగా కొందరు ఆయనపై చెప్పులు విసిరేశారు. అప్పట్లో ఓ పెద్ద మనిషి సాయంతో చంద్రబాబుతో సహా, కొందరు ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలవడం, ఏక పక్షంగా అవిశ్వాస తీర్మానం పెట్టడం, పరీక్షలో ఎన్టీఆర్ ఓడటం, చంద్రబాబు నెగ్గడం లాంటివి జరిగిపోయాయి. తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబును ఉద్దేశించి, ప్రసంగించడం ఇవా అప్పుడు జరిగిన సంఘటనలు మొత్తం, రాంగోపాల్ వర్మ చిత్రంగా తీయనున్న నేపద్యంలో ఖచ్చింతంగా ఆ చిత్రం రాజకీయ దుమారాన్ని రేపుతుందనడంలో సందేహం లేదు. కొందరు నేతల తీరును కూడా వర్మ ఆ చిత్రంలో చూపించనున్నారు.

SHARE

LEAVE A REPLY