ల్యాప్‌టాప్‌లపై భారీ రాయితీ!!

0
46

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒–వర్క్‌ ఫ్రం హోమ్‌కు కంపెనీలు మొగ్గుచూపుతుండటంతో దేశవ్యాప్తంగా ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సంస్థలు రాయితీలు, గిఫ్ట్‌ కార్డులతో ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన మల్టీబ్రాండ్‌ షోరూం ఐటీ మాల్‌.. హెచ్‌పీ, డెల్‌, లెనోవో, ఏసర్‌, ఆసుస్‌ కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లపై 15 శాతం వరకు రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు స్క్రాచ్‌కార్డుతో మొబైల్‌, ట్యాబ్లెట్‌ వంటి బహుమతులు గెలుచుకొనే అవకాశం కూడా కల్పించింది. రూ.50 వేల వరకు క్యాష్‌బ్యాక్‌, ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8 వేల యాక్సెసరీస్‌ సైతం అందుకోవచ్చునని సంస్థ తెలిపింది. ఒకేసారి 25కి పైగా యూనిట్లను కొనుగోలు చేసే ఇన్‌స్టిట్యూషనల్‌ కస్టమర్లకు డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం రాయితీ, యాక్సెసరీస్‌పై 25 శాతం వరకు తగ్గింపు పొందవచ్చునని కంపెనీ ఎండీ అహ్మద్‌ తెలిపారు.

SHARE

LEAVE A REPLY