తూర్పుగోదావరి జిల్లాలో కోళ్ల పందాల హంగామా!!

0
130

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-కోనసీమలో కోడి పందాలు నిర్వహించకపోతే.. సందడే ఉండదు. ఏటా సాంప్రదాయంగా వస్తోన్న కోళ్ల పందేల కోసం ఒకవైపు పుంజులు కాళ్లు దువ్వుతుంటే.. మరోవైపు పందెం రాయుళ్లు బరులను సిద్ధం చేస్తున్నారు. వీటికి ఇప్పుడు ఏపీలో ఏర్పాట్లు మామూలుగా లేవు. అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే లెవల్‌లో ఈ కోడి పందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుపడ్డా.. పందాలు జరిపి తీరుతామంటున్నారు ఏపీ వాసులు.

ఒకపక్క పోలీసుల ఆంక్షలు ఉన్నా కూడా.. లెక్కచేయకుండా ఏర్పాట్లు చేశారు తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక గ్రామస్తులు. అనాధిగా వస్తోన్న ఆచారాన్ని ఎలా పక్కన పెడతామంటున్నారు. పోలీసులు టెంట్లు ధ్వంసం చేసి.. తొలగించినా కూడా.. మళ్లీ అక్కడే ఏర్పాట్లు చేసి నిర్వహిస్తున్నారు గ్రామస్తులు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా మేము సైతం అంటూ.. పందేల్లో పాల్గొంటున్నారు. పండుగ నాలుగు రోజులూ ఈ హడావిడి ఖచ్చితంగా ఉంటుందని అక్కడి గ్రామస్తులు పేర్కొంటున్నారు. అక్కడే కాకుండా ఏపీ వ్యాప్తంగా కూడా కోళ్ల పందేల నిర్వహణ జోరుగా నడుస్తోంది. కాగా ఈ కోళ్ల పందేల్లో.. కాకి, డేగ, పచ్చ డేగ, నెమలి, ఆబ్రాస్, రసంగి, ఎర్ర నెమలి, పండు డేగ, పర్ల, పింగల, మైల పలు జాతులు కనిపిస్తాయి.

SHARE

LEAVE A REPLY