ఆరోపణలపై స్పందించిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్

0
135

Times of Nellore (Guntur)#కోట సునీల్ కుమార్ # – తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై మాజీ స్పీకర్ కోడెల వివరణ ఇచ్చారు. బెదిరించి, కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. తన కుటుంబ సభ్యులపై 7, 8 కేసులు పెట్టారని.. ఇంకెన్ని కేసులు పెడతారో తెలియట్లేదన్నారు. స్పీకర్‌ పదవికి కళంకం తెచ్చానని విజయసాయిరెడ్డి ఆరోపించడం సరికాదన్నారు. బాధితులు బయటకు వచ్చి కోడెల ఫ్యామిలీపై కేసులు పెట్టాలంటూ విజయసాయిరెడ్డి పెట్టే ట్వీట్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇతర పార్టీల కార్యకర్తలపై దాడులు, దుర్మార్గాలకు పాల్పడలేదని వివరించారు. కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు గ్రామాలను విడిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. తాను కేసులకు భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తే చూస్తూ ఊరుకోమని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

SHARE

LEAVE A REPLY