చంద్రబాబు పై కన్నా లక్ష్మి నారాయణ వ్యాఖ్యలు

0
216

Times of Nellore (Guntur) – సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం గుంటూరులో జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు, పురందేశ్వరి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో కుక్కను మేక అని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన భజన మీడియా చేస్తోందన్నారు.

రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న అది కేంద్రం సహకారంతోనే అని కన్నా అన్నారు. ‘అంతేకాక దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్‌లలో ఏపీకే అత్యధిక నిధులు కేటాయించారు. ఏపీకి అన్ని రంగాల్లో సింహాభాగం నిధులు కేటాయించారు. నాలుగేళ్ళుగా చంద్రబాబు కేంద్రం నిధులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. చంద్రబాబు చేసే అవినీతిని ప్రజలందరికి తెలియజేయాలి. బాబు తాను బురద పూసుకుంటూ.. దానిని మనకి పూయాలని చూస్తున్నాడు. అంతేకాక ఏపీలో బాబు మోసం చేయని కులం అంటూ ఉందా? వెనక్కి తిరిగి చూసుకుంటే బాబుదంతా అవినీతి చరిత్ర. త్వరలో ఇంటింటికి బీజేపీలో భాగంగా బాబు అవినీతిని ప్రజలందరికి వివరించాలని’ కన్నా లక్ష్మీనారాయణ సమావేశంలో పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY