చంద్రబాబు పై కె ఏ పాల్ వ్యాఖ్యలు

0
136

Times of Nellore (Hyd) # కోట సునీల్ కుమార్‌#  – సీఎం చంద్రబాబు తనకు శాంతి సభలు పెట్టుకోవడానికి అనుమతులివ్వడం లేదంటూ కేఏ పాల్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో కేఏ పాల్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబు కాదని, ఆయన ముఖ్యమంత్రి కాకముందే హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్ర ఉందని పాల్ చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ఎవరో నిజంగానే తనకు తెలియదని చెప్పారు.

తనకున్న ఫాలోయింగ్ గురించి మాట్లాడుతూ.. ‘‘వారం క్రితం ఓ చానెల్‌లో మాట్లాడుతూ బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పా. యూట్యూబ్‌లో ఆ వీడియోను 14 లక్షల మంది చూశారట. ఉన్న సత్యం అది. నేను ఇండియా వదిలి 30 సంవత్సరాలు అయింది. అక్కడ ఎంజిలినా జోలిని చూశారు.. షారుఖ్‌ఖాన్‌ను చూశారు.. అమితాబ్ బచ్చన్‌ను చూశారు. నేను ఆంధ్రాలో ఉన్నదే తక్కువ. తప్పా నేనన్నది?. నేను బాలకృష్ణను కలవలేదండి.. పేరు మాత్రం విన్నా.. ఆయన యాక్టరా అని అడిగా?. ఆ వీడియోనే అంత మంది చూశారు. అదే చానెల్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడితే కేవలం 5 వేలు, 10 వేలు మంది మాత్రమే చూస్తున్నారు. అంటే వాళ్లకంటే నాకు 100 రెట్ల ఫాలోయింగ్ ఉన్నట్లే కదా.. ఆయన మాట్లాడిందానికి 10 వేలు ఏంటి? నేను మాట్లాడినదానికి 14 లక్షలు ఏంటి? ఈ ఫాలోయింగ్ వల్లే 6 లక్షల మంది భీమవరం వస్తున్నారని మా సభకు మద్దతు ఇవ్వలేదు.’’ అని పాల్ పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY