అప్పుడే పుట్టిన పసికందుకు ‘ఫణి’ తుఫాన్ పేరు!

0
180

Times of Nellore (Bhuvaneswar) # కోట సునీల్ కుమార్ # – కొంతమంది పేర్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలను బట్టి ఆయా వ్యక్తులకు పేర్లు పెడుతుంటారు. తాజాగా అలాంటి ఓ ప్రత్యేకమైన పేరే ఒడిషాకు చెందిన చిన్నారికి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న రైల్వే ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం 11.30కు 32 ఏళ్ల మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిట్టి తల్లికి ‘ఫణి’ అని పేరు పెట్టారు. ఒడిషా తీరప్రాంతాన్ని ఫణి తుఫాన్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిడ్డకు ఫణి అని నామకరణం చేశారు. ఆ మహిళ మంచేశ్వర్‌లోని కోచ్ రిపేర్ వర్క్ షాపులో హెల్పర్‌గా పని చేస్తోంది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY