రవిప్రకాష్‌కు జర్నలిస్టుల మద్దతు

0
136

Times of Nellore (Hyd) #కోట సునీల్ కుమార్ # – రవిప్రకాష్‌పై బనాయించిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద జర్నలిస్టు ఫోరం టు సేవ్‌ తెలంగాణ, తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. సీనియర్‌ జర్నలిస్టులు అమర్‌, సతీష్‌ కమల్‌, గోపీయాదవ్‌లు ఈ దీక్షలను ప్రారంభించారు. ఇందులో విద్యావెంకట్‌, సంపత్‌, శ్రీరామ్‌, బద్రి, విశాల్‌, హరికృష్ణ, నాగరాజు, ఎం.శ్రావణ్‌కుమారులు పాల్గొన్నారు. ఈ రిలే దీక్షలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీ ల వెంకటేష్‌, హెచ్‌యూజే అధ్యక్షుడు ఇ.చంద్రశేఖర్‌లు మ ద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా అమర్‌, సతీష్ కమల్‌లు మాట్లాడుతూ గొంతెత్తే వారిని హెచ్చరించేలా పాలకులు ప్రజాస్వామ్యానికి ఒక సవాల్‌ విసురుతున్నారని అన్నారు. ఈ సవాల్‌కు ఎదురొడ్డి నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ జర్నలిస్టులపై అరాచాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు విజయకుమార్‌, అమరేందర్‌, ప్రమోద్‌, బగిలి సత్యం పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY