జనసేన మేనిఫెస్టో ప్రకటించిన పవన్

0
106

Times of Nellore (Rajamandry) # కోట సునీల్ కుమార్ #- అధికారంలోకి వస్తే ఉభయగోదావరి జిల్లాల్లో రూ.5వేల కోట్లతో గ్లోబల్‌ మార్కెట్ ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. జనసేన ఆవిర్భావ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టో వెల్లడించారు. రైతులకు ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు ఇస్తామన్నారు. అలాగే ప్రతి ఏకరాకు రూ.8వేలు సాగు సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఇక 60 ఏళ్లు దాటిన సన్నకారు రైతులకు రూ.5వేలు పెన్షన్‌ ఇస్తామని వెల్లడించారు. ఒకటి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు.

విద్యార్థులకు ఉచిత రవాణా, అన్ని కులాలకు కలిపి కామన్‌ హాస్టల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఆరు నెలల్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామని తెలిపారు.

SHARE

LEAVE A REPLY