పైరవీలపై జగన్ కన్నెర్ర !

0
344

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – రాష్ట్ర మంత్రుల పేషీల్లో ఉద్యోగుల బదిలీల కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. మంత్రివర్గం లోని అయిదుగురు మంత్రుల బంధుగణమైతే అన్నీ తామై ఈ బదిలీల వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడం తో , ఆ ఐదు మంది మంత్రులను పిలిచి ఇది ఫస్ట్ వార్నింగ్.. తీరు మార్చుకోకపోతే అంతే సంగతులంటూ హెచ్చరించినట్లు సమాచారం . దీంతో ఎప్పుడూ నవ్వుతూ..అన్నా..అమ్మా అంటూ పిలిచే ముఖ్యమంత్రి జగన్, ఒక్కసారిగా సీరియస్ అయ్యే సరికి మంత్రులు హడలిపోయినట్లు తెలుస్తోంది .

తాము ఏం చేసినా ఎక్కడో క్యాంపు కార్యాలయంలో కూర్చొనే ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుందిలే అనుకున్న మంత్రులకు ఆధారాలతో సహా ఏం చేశారో వివరించారట జగన్ .వారిలో ఒక సీనియర్ మంత్రికి , తన వద్దనున్న సమాచారం చెప్పడంతో బిత్తర పోయినట్లు తెలుస్తోంది . ఇక మిగిలిన నలుగురు మంత్రులు తమని హెచ్చరికతో వదిలిపెట్టడంతో బతికిపోయాం అంటూ బయటపడ్డారట. తాను గతంలోనే అవినీతి పట్ల కఠినంగా ఉంటానని చెప్పానని..ఇప్పుడు హెచ్చరిస్తున్నానని..మరో సారి ఇదే విధంగా జరిగితే మంత్రులుగా మీరు ఉండరంటూ తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది .

ముఖ్యమంత్రిగా జగన్ తానేంటో ఆచరణలో చూపిస్తున్నారు. తాను ఎలాంటి వాడిననే విషయాన్ని తాను తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా రుజువు చేసుకుంటున్నారు . ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించి వారి అభిమానాన్ని చూరగొన్న జగన్ , పెన్షన్ పెంపు ద్వారా వృద్ధులు , వికలాంగులు మనస్సులు గెల్చుకున్నారు . ఇక తాను ఏరి కోరి మంత్రులను తీసుకున్నారు. వారి పనితీరు నెల రోజులను మధింపు చేసిన ఆయన, మంత్రుల పేషీలలో బదిలీల పేరిట జరుగుతున్న అవినీతి తంతు పై జగన్ సీరియస్ అయి, మంత్రులను గట్టిగానే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది .

SHARE

LEAVE A REPLY