జగన్‌ చేసిన పనికి.. సెల్యూట్ చేస్తోన్న నెటిజన్లు..!

0
91

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ – సీఎం.. సైగ చేస్తే చాలు.. అందరూ.. ఆయన చుట్టూ నిలుచుంటారు. అలాంటి స్థానంలో ఉండి.. సాధరణ వ్యక్తిలా.. జగన్ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గురువారం 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పథకాలు సీఎం చేతుల మీదుగా వారికి ఇస్తారు. ఈ సందర్భంలో ఓ ఆర్మీ పోలీస్ ఆఫీసర్ మెడల్ ఒకటి కింద పడింది. ఇది గమనించని.. ఆ ఆఫీసర్ కవాతు చేసుకుంటూ.. ముందుకువెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం జగన్ తీసి మరో అధికారి చేతికి ఇచ్చారు.

కాగా.. ఈ సందర్భాన్ని అక్కడున్న కొంతమంది వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. రాత్రి రాత్రే ఫుల్‌గా వైరల్ అయ్యింది. ముఖ్యమైన పదవిలో ఉన్నా.. ఏమాత్రం అధికార దర్పం ప్రదర్శించకుండా.. కింద పడిన పోలీస్ మెడల్‌ని తీసి ఇచ్చిన జగన్‌.. హుందాగా వ్యవహరించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY