సీబీఐ కోర్టుకు హాజరుకాని సిఎం జగన్‌!

0
150

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –  ఏపి సిఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) న్యాయస్థానానికి హాజరవుతారన్న విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఆయన కోర్టులో విచారణకు హాజరుకాలేదు. ఏపీలో ఓ కేంద్ర మంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ రోజు మినహాయింపుకోరడంతో ఆయన చేసుకున్న అభ్యర్థనను సీబీఐ న్యాయస్థానం అంగీకరించింది. అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. కాగా, ఈ కేసులో కోర్టు విచారణకు హాజరవడంపై మినహాయింపును ఇవ్వాలంటూ జగన్ పెట్టుకున్న పిటిషన్ ఇటీవలే న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించడంతో ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

SHARE

LEAVE A REPLY