జగన్‌పై దాడి కేసులో నిందితుడు విజయవాడకు తరలింపు

0
75

Times of Nellore (Visakha) # కోట సునీల్ కుమార్ # – వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాస్‌ను విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. ఈరోజు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు ముందు శ్రీనివాస్‌ను హాజరుపర్చనున్నారు. జగన్‌పై దాడి చేసిన కేసు విశాఖ కోర్టు పరిధి నుంచి విజయవాడకు బదిలీ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ కేసును విచారించే విజయవాడ మెట్రో పాలిటన్ సెషన్ జడ్జ్ కోర్టుకు కేసును బదిలీ చేశారు. జగన్‌పై దాడి కేసు పత్రాలను ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేయాలంటూ విశాఖ ఏడో అదనపు మెట్రో పాటిటన్ మెజిస్ట్రేట్ కోర్టును అధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన పత్రాలను విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టుకు పంపించారు. దీంతో కోటి కత్తి దాడి కేసు ఇక విజయవాడలోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో విచారణ జరుగనుంది.

ఈ పరిస్థితుల్లో నిందితుడు శ్రీనివాస్‌ను విశాఖ కేంద్ర కారాగారం నుంచి విజయవాడకు తరలించారు. ఎన్‌ఐఏలోని అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో దర్యాప్తుకు ఈనెల 1 నుంచి విశాఖలో ఉన్న బృందం న్యాయపరమైన చర్యలు పూర్తి చేసింది. నిందితుడు జె.శ్రీనివాస్‌ను అడవివరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలని జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అడవివరం కేంద్ర కార్యాలయం నుంచి నిందితుడిని రాత్రి 12 గంటలకు విజయవాడ తరలించారు. కోర్టులో హాజరుపర్చి తిరిగి విశాఖ తరలించనున్నారు

SHARE

LEAVE A REPLY