వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని…

0
390

Times of Nellore ( Guntur ) – గుంటూరు జిల్లాలోని కోబాల్ పేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి చిన్నారి ఒల్లంతా వాతలు పెట్టింది. రిజ్వానా అనే ఓ మహిళ బాలస్వామి అనే అతడిని కులాంతర వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో గొడవపడి విడిపోయిన రిజ్వానాకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డు వస్తున్నారని పెద్ద కొడుకును అమ్మేసింది. రెండో కొడుకు చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. రెండు రోజుల క్రితం చిన్నారికి ఒల్లంతా వాతలు పెట్టి, ఇంటికి తాళం వేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. గాయాలతో ఏడుస్తున్న చిన్నారిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మొదటి భర్త ఆస్పత్రిలో తన కుమారుడిని దగ్గరుండి చూసుకుంటున్నాడు. తనకు కూడా ప్రాణహాని ఉందని తన భార్య ప్రియుడుతో కలిసి కుట్ర చేస్తోందని, తనకు, తన కుమారుడికి న్యాయం జరగాలని ఆయన మీడియా ద్వారా వేడుకున్నాడు.

SHARE

LEAVE A REPLY