ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య…

0
529

Times Of Nellore ( Vijayawada ) – ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడ గాంధీ మహిళా కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అనిత అనే విద్యార్ధిని బుధవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డింది.ఆడపిల్లగా పుడితే ఇన్ని వేధింపులు భరించాలా? అంటూ ఆ విద్యార్ధిని తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఆమెను వేధింపులకు గురిచేసిన వ్యక్తులను గుర్తించేందుకు వీధుల్లోని, కళాశాల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్లు ఏమైనా వేధించారా? లేక ఎవరైనా యువకులు ప్రేమ వేధింపులకు గురిచేశారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

SHARE

LEAVE A REPLY