ఇండియాలో కరోనా..తమిళనాడులో తొలి మృతి!!

0
52

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- భారతదేశం లో కరోనా పంజా విసురుతోంది. మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తాజాగా మరో మరణం చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. మధురై లోని రాజాజీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందడం జరిగిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సి.విజయ్ భాస్కర్ వెల్లడించారు.

ఇతనికి ఇటీవలే కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ 2020, మార్చి 25వ తేదీ ఇతను కన్నుమూశాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 11కు చేరుకుంది. ఇతనికి రక్తపోటు, మధుమేహంతో బాధ పడుతున్నారని, మంత్రి వెల్లడించారు.

భారతదేశంలో కరోనా విజృంభిస్తుండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. 21 రోజుల పాటు దేశమంతా పూర్తిగా లాక్ డౌన్ పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం వెలువడించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కట్టడి చేయాలంటే ప్రజలు సహకరించాలని, ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని ఆయన సూచించారు.

మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. 2020, మార్చి 23వ తేదీ సోమవారం 496 ఉన్న కరోనా కేసులు..2020, మార్చి 24వ తేదీ మంగళవారం రాత్రి కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా…మొత్తం కేసులు…536కి చేరుకున్నాయి.

SHARE

LEAVE A REPLY