చంద్రబాబుపై ఐఏఎస్‌ల ఆగ్రహం

0
238

Times of Nellore (Amaravati) # కోట సునీల్ కుమార్ #  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోవర్టు అని, సహ నిందితుడు అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఎల్వీ సుబ్ర హ్మణ్యంను సహనిందితుడు అని ఎలా సంబోధిస్తారని నిలదీస్తున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్న సీఎస్‌ను కోవర్టు అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా అంటారు? ఇదేనా ఆయన చెప్పుకునే 40 ఏళ్ల అను భవం. రాజకీయంగా ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు. దాంతో అధికారులకు సంబంధం లేదు. కానీ, రాష్ట్ర అత్యున్నత అధికారిని కోవర్టు అని ముఖ్యమంత్రి అన్నాడంటే ఇంగిత జ్ఞానం కోల్పోవడమే’’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నిలదీస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై ఏపీ ఐఏఎస్‌ అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎస్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయాలని ఐఏఎస్‌ అధికారుల సంఘం భావి స్తోంది. ఎల్వీ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చర్యలు తీసుకో వాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని అసోసి యేషన్‌ యోచిస్తోంది. త్వరలో అసోసియేషన్‌ సమా వేశమై ఈ మేరకు తీర్మానం చేసి గవర్నర్‌కు సమర్పించాలని భావిస్తున్నట్లు కొందరు ఐఏఎస్‌ అధికారులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY