సీఎం జగన్‌కు ఎమ్మెల్యే బాలకృష్ణ లేఖ.. ఏం కోరారంటే..

0
60

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ రెడు లేఖలు రాశారు. ఫ్యాక్స్ ద్వారా సీఎం కార్యాలయానికి లేఖలను పంపించారు. జిల్లాల పునర్విభజన జరిగితే హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు బాలకృష్ణ. అటు హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరైన నేపథ్యంలో.. ఆ కాలేజీని హిందూపూర్ సమీపంలో మలుగూరు వద్ద ఏర్పాటు చేయాలని మరో లేఖలో సీఎంను కోరారు.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తులు జరుగుతున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని ఎన్నికల్లోనే సీఎం హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా 12 కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జూలై 15న జరిగే కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఐతే పార్లమెంట్ నియోజకవర్గాలుగా జిల్లాలను విభజిస్తే సమస్యలు వస్తాయని అధికార పార్టీకి చెందిన నేతలే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

SHARE

LEAVE A REPLY