హాల్‌టికెట్‌ చూపిస్తే.. బస్సులో ఉచితం – మంత్రి గంటా శ్రీనివాసరావు

0
217

Times of Nellore ( Amaravati ) – ఈనెల 15నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణపై సోమవారం విజయవాడలోని తన క్యాంప్‌ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఈ పరీక్షలకు 6,17,484మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకోసం 2,834 సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడా మౌలిక సదుపాయాల కొరత రానీయవద్దని, ప్రతి విద్యార్థి బల్లపై కూర్చొని పరీక్ష రాయాల్సిందేనని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో రవాణ సౌకర్యాలపై దృష్టి సారించాలని డీఈవోలకు సూచించారు. ఫీజులపేరుతో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా వేధించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సులో పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించాలన్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందుగా విద్యార్థులు సెంటర్‌కు చేరుకోవాలని, మరిన్ని వివరాలకు 0866-2974450, 0866-2974550 కు ఫోన్‌ చేయాలని సూచించారు.

SHARE

LEAVE A REPLY