హజ్‌ యాత్రికులపైనా జీఎస్టీ వేయడం దారుణం

0
144

Times of Nellore ( Vijayawada ) – రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం సాయంతో 2,348 మంది ముస్లింలు హజ్‌ యాత్రకు సిద్ధం కాగా.. మొదటి విడతగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 200 మంది బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని ప్రజావేదిక వద్ద శుక్రవారం ముస్లింలు సభ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి చంద్రబాబును సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. 2019లో హజ్‌ యాత్రకు గన్నవరం విమానాశ్రయం నుంచే విమానాలు బయలుదేరతాయని ధీమా వ్యక్తం చేశారు. హజ్‌ యాత్రికులపైనా కేంద్రం జీఎస్టీ విధిస్తుండటం దారుణమని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీల ఉన్నత చదువులకు రూ.10-15లక్ష సాయం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వక్ఫ్‌ బోర్డ్ ఆస్తులను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

SHARE

LEAVE A REPLY