ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..!!

0
42

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ దసరా తీపికబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో 2018 జూలై నుంచి 2019 డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది.

జూలై 2018 మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో, జనవరి 2019 రెండో డీఏను 2021 జూలై జీతాల్లో.. జూలై 2019 మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కరోనా కారణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెల సగం జీతాలను 5 విడతల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కాగా, డీఏల చెల్లింపులకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

SHARE

LEAVE A REPLY