గాయపడిన జనసేన కార్యకర్తలను పరామర్శించిన పవన్‌!!

0
110

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం కాకినాడ చేరుకున్నారు. తొలుత నగరంలోని గుడారిగంటలో జనసేన స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి ఆయన చేరుకున్నారు. కాగా ఆదివారం జరిగిన దాడి ఘటనలో గాయపడిన జనసేన కార్యకర్తలను నానాజీ నివాసంలో పవన్ పరామర్శించారు. ఘటన జరిగిన తీరును జనసేన కార్యకర్తలు తమ అధినేతకు వివరించారు. పవన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ నగరంలో 144 సెక్షన్‌తో పాటు పోలీస్‌యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. మరోవైపు స్థానిక వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాడి ఘటన ఆరోజు జరిగిన పరిణామాలపై తమ పార్టీ నేతలతో పవన్ చర్చిస్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.

కాగా అంతకు ముందు విశాఖ విమానాశ్రయం నుంచి పవన్ కాన్వయ్ వెంట బయల్దేరిన పలువురు జనసేన నేతల వాహనాలను మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. తుని, ప్రత్తిపాడు కొందరు నేతలను అడ్డుకొని పరిమిత సంఖ్యలో వాహనాలనే పవన్ కాన్వాయ్ వెంట అనుమతించారు.

SHARE

LEAVE A REPLY