గణేష్ పందిర్లకు అనుమతి లేదు!!

0
61

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ప్రతి ఏడాది ఘనంగా జరిగే వినాయక చవితి ఉత్సవాలకు ఈసారి బ్రేక్ పడింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే గణేష్ ఉత్సవాలకు సంబంధించి పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. విగ్రహం ఎత్తుతో పాటు గణేష్ మండపాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై పలు ఆదేశాలను జారీ చేశాయి. ఇక విజయవాడలో చవితి పందిర్లకు అనుమతి లేదని సీపీ శ్రీనివాసులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో అనుమతులు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. అందరూ ఇళ్లలోనే గణేష్‌ పండుగ జరుపుకోవాలని శ్రీనివాసులు సూచించారు.

SHARE

LEAVE A REPLY