కేసీఆర్ జన్మదినం వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

0
102

Times of Nellore (Hyd) – ఈనెల 17న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా జలవిహార్‌లో ఏర్పాట్లను తలసాని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమాలు, యజ్ఞాలు, కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు కేటీఆర్, హరీష్, కవిత ముఖ్య అతిథులుగా హాజరు అవుతారన్నారు. అలాగే తెలంగాణ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

SHARE

LEAVE A REPLY