నేటి నుంచి నాగార్జున కొండకు లాంచీ ప్రయాణం

0
190

Times of Nellore ( Vijayapuri Sout ) – ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు బుధవారం నుంచి లాంచీలను నడపనున్నట్లు పర్యాటక శాఖ డీవీఎం బాబ్జి తెలిపారు. మంగళవారం స్థానిక లాంచీ స్టేషన్లో ఆయన విలేకరులకు వివరాలు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదాల దృష్ట్యా లాంచీల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను బందరు పోర్టు అధికారులకు ప్రభుత్వం బదలాయించిందన్నారు. ఈ క్రమంలో బందరు పోర్టు అధికారులు లాంచీల పనితీరును పరిశీలించి తిరిగేందుకు అనుమతించారని, లాంచీలను నడపాలంటూ పర్యాటక శాఖ జనరల్‌ మేనేజర్‌ ఆదేశాలు ఇచ్చారన్నారు. దీంతో బుధవారం నుంచి లాంచీలను నాగార్జున కొండకు యథావిధిగా నడుపుతామన్నారు. ఆయన వెంట లాంచీ యూనిట్‌ మేనేజర్‌ సూర్యచంద్రరావు ఉన్నారు.

SHARE

LEAVE A REPLY