విమానాల్లోనూ సంక్రాంతి బాదుడు…!

0
53

Times of Nellore (Hyd)  # కోట సునీల్ కుమార్ #- సంక్రాంతి రద్దీ ఆర్టీసీ బస్సులు, రైళ్లనే కాదు.. విమానాలను సైతం తాకింది. అన్ని ప్రధాన రైళ్లలో టికెట్‌ బుకింగ్‌లను నిలిపివేయడంతో అప్పటికప్పుడు బయలుదేరేందుకు ‘ఫ్లైట్‌ జర్నీ’ చేయాలనుకుంటున్న ప్రయాణికులకు పెరిగిన చార్జీలు చూడగానే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖకు వెళ్లేందుకు విమాన చార్జీ రూ.5వేల వరకు ఉంటుంది. కానీ ఈ నెల 12వ తేదీన ఆ ధర ఏకంగా రూ.18 వేల నుంచి రూ.47 వేలకు పెరిగింది. ఒక్కో ఎయిర్‌లైన్స్‌ చార్జీలు ఒక్కోవిధంగా ఉన్నాయి. అదేరోజు హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ చార్జీలు రూ.16,773 మాత్రమే ఉండడం గమనార్హం. న్యూఢిల్లీకి రూ.8,145 నుంచి రూ.9,191 వరకు ఫ్లైట్‌ చార్జీ ఉంది.

సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే నగరవాసుల రద్దీ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు తెలుసుకునేందుకు అనూహ్యంగా పెరిగిన విమాన చార్జీలే నిదర్శనం. 12వ తేదీన హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రూ.9,165 నుంచి రూ.15,024 వరకు ఉంది. అలాగే రాజమండ్రికి రూ.8,672 నుంచి రూ.14,867 వరకు చార్జీలు ఉన్నాయి. ఈ విమాన చార్జీలు గురువారం సాయంత్రం నమోదైనవి మాత్రమే. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్‌ తదితర నగరాల కంటే విశాఖ, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాల చార్జీలు అధికంగా ఉండడం గమనార్హం. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ఈ చార్జీలు మరింత పెరిగే అవకాశముంది.

SHARE

LEAVE A REPLY