మత్య్సకారుల నేపథ్యంలో ‘జెట్టి’!!

0
93

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-మత్స్యకారుల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘జెట్టి’. సుబ్రమణ్యం దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తెలుగు తెరపై ఎప్పుడూ చూడని కథాంశంను తెరమీదకు తెస్తున్న చిత్రమిది. అజయ్‌ ఘోష్‌, మన్యం కృష్ణ, మైమ్‌ గోపి ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ప్రారంభం ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలం గ్రామంలోని దేవాలయంలో జరిగింది. ప్రజాప్రతినిధులు ఆమంచి కృష్ణమోహన్‌, మోపిదేవి వెంకటరమణ, మోపిదేని హరిబాబు ప్రారంభంలో పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక మాట్లాడుతూ “ప్రపంచం అంతా సాంకేతికంగా పరుగులు పెడుతున్నా, అనాదిగా వస్తున్న ఆచారాలని నమ్ముకుంటూ,వాటి విలువను పాటిస్తూ, సముద్రపు ఒడ్డున ఆవాసాలు ఏర్పరచుకుని జీవించే వారి జీవన విధానాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం” అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్‌ ఉమ్మడి సింగు, నిర్మాతలు: కునపరెడ్డి వేణుమాధవ్‌, పండ్రాజు వెంకట రామారావు.

SHARE

LEAVE A REPLY