ఫ్యాన్స్ కోసం బండ్ల గణేష్ తో సినిమా..??

0
52

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – ఇటీవల కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తున్నారన్న వార్తలు విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని అందుకోవడంతో ఇకపై రాబోయే రోజుల్లో తన పూర్తి స్థాయి సమయాన్ని రాజకీయాలతోను అలానే ప్రజాక్షేత్రంలోనే గడపాలని పవన్ నిశ్చయించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ విషయమై అయన సోదరుడు నాగబాబు సైతం ఇకపై పవన్ సినిమాల్లోకి రారని, అలానే ఆయన తన రాబోయే జీవితం మొత్తాన్ని ప్రజాసేవకోసమే వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు.

 

అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన మాకోసం ఒక్క హిట్ సినిమా చేస్తే చాలు అని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయమై నేడు ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో ఒక వార్త విపరీతంగా షికారు చేస్తోంది. అదేమిటంటే, ఇటీవల తానా సభలకు అమెరికా పర్యటనకు వెళ్లిన పవన్, అక్కడి అభిమానుల నుండి కూడా తమ కోసం ఒక మంచి హిట్ సినిమా చేయాలనే విజ్ఞాపనలు విన్నారట. కానీ తనకు ప్రస్తుతం పార్టీ కార్యాచరణ, మరియు కార్యక్రమాలతో తీరిక లేకుండా పోయిందని, ఒకవేళ అవకాశం ఉంటె చూద్దాం అని తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అయితే ఇదే విషయం ఆయన వీరాభిమాని అయిన బండ్ల గణేష్ వద్దకు చేరడంతో, కొద్దిరోజుల క్రితం బండ్ల, పవన్ ను కలిసి, మీరు ఒప్పుకుంటే ఒక మంచి సినిమా చేద్దాం, నిర్మాతగా నేను వ్యవహరిస్తాను అని చెప్పినట్లు సమాచారం. అయితే అందుకు పవన కూడా కొంత సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు.

అయితే ఆ సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎవరెవరు నటిస్తారు అనే తదితర విషయాలపై మాత్రం మరికొన్నాళ్లు ఆగితేనేగాని స్పష్టత రాదట. తమ వంటి ఫ్యాన్స్ కోసం పవన్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు బండ్ల, పవన్ కు థాంక్స్ చెప్పారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియనప్పటికీ, ఒకవేళ నిజమే అయితే మాత్రం ఎప్పటినుండో పవన్ నుండి ఒక సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్న అయన ఫ్యాన్స్ కు మాత్రం ఇది పండుగ వార్తే అని చెప్పాలి….!!

SHARE

LEAVE A REPLY