ఫేస్ బుక్ ఇండియా పాలసీ హెడ్ అంఖిదాస్ రాజీనామా!!

0
42

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ఫేస్ బుక్ ఇండియా పాలసీ హెడ్ అంఖిదాస్ రాజీనామా చేశారు. దాదాపు 9 సంవత్సరాల పాటు ఆమె భారత, సౌత్, సెంట్రల్ ఆసియా ప్రాంతాలకు సంబంధించి ఫేస్ బుక్ ఆపరేషన్స్ ని నిర్వహిస్తూ వచ్చారు. బీజేపీకి అనుకూలంగా ఆ పార్టీ నేతల ద్వేష పూరిత ప్రసంగాల విషయంలో ఈమె జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఈమెపై ఉన్నాయి. పైగా బీహార్ ఎన్నికల్లో ఈ పార్టీకి ఫేవర్ గా కంపెనీ మోడరేషన్ పాలసీని అంఖిదాస్ రూపొందించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆమె రాజీనామాకు, ఈ వివాదానికి సంబంధం లేదని, పబ్లిక్ సర్వీసులో తన వ్యాసంగాన్ని కొనసాగించాలనుకోవడమే ఆమె నిర్ణయానికి కారణమని ఫేస్ బుక్ స్పష్టం చేసింది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నామని ఫేస్ బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ అన్నారు.

లోగడ భారత ప్రభుత్వంతో బాటు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వాన గల పార్లమెంటరీ కమిటీ కూడా ఫేస్ బుక్ ప్రతినిధులను కొన్ని గంటలపాటు ప్రశ్నించింది. బీజేపీ నేతల ప్రసంగాలను ఫేస్ బుక్ చూసీ చూడనట్టు వదిలేస్తోందని గత ఆగస్టులో ది వాల్ స్ట్రీట్ జర్నల్, టైమ్ మ్యాగజైన్ తమ ఆర్టికల్స్ లో పేర్కొన్నాయి. దీన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దుయ్యబడుతూ వచ్చింది. ఈ పార్టీ నేత రాహుల్ గాంధీ వరుస ట్వీట్లతో బీజేపీ, ఫేస్ బుక్ మధ్య లింక్ ను హైలైట్ చేసిన విషయం గమనార్హం.

SHARE

LEAVE A REPLY