సర్పంచ్‌ నామినేషన్లకు నేటితో గడువు ముగింపు

0
420

Times of Nellore (హైదరాబాద్‌)# కోట సునీల్ కుమార్ #: రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌కు 5413, వార్డ్‌మెంబర్లకు 16946 నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 7067 అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను సమర్పించగా.. రెండో రోజు 22359 అభ్యర్థులు దాఖలు చేశారు. ఇప్పటివరకు మొత్తం సర్పంచ్‌కు 8524, వార్డుకు 20902 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్‌ సమర్పణ గడువు ముగుస్తుంది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి.

SHARE

LEAVE A REPLY