వైఎస్సార్‌ సీపీలోకి రాయలసీమ మాజీ ఐజీ

0
385

Times of Nellore ( Eluru ) – రాయలసీమ మాజీ ఐజీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి…కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఇక్బాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక పదవులను నిర్వహించారు. పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితర నాయకులు ఇక్బాల్ను తీసుకుని పార్టీ అధ్యక్షుడి వద్దకు తీసుకుని వచ్చారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఆయన దెందులూరు శివారు నుంచి 163వ రోజు పాదయాత్రను ప్రారంభించారు.

SHARE

LEAVE A REPLY