గంజాయి తరలిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్ట్

0
178

Times of Nellore (Vijayanagaram) #కోట సునీల్ కుమార్ # – ఈజీ మనీ కోసం విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. విలాసాలకు అలవాటు పడ్డ విద్యార్థులు అక్రమార్జున కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకొని అడ్డంగా బుక్కయ్యారు. గంజాయ్ తరలిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరకు నుంచి విశాఖకు కారులో తరలిస్తుండగా ముగ్గురు బీటెక్ విద్యార్థులు కొత్తవలస పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి సుమారు 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మూడు సెల్‌ఫోన్లు, కారు సీజ్ చేశారు. ఈజీ మనీ కోసం గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అరెస్టైన విద్యార్థులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. చల్లా రాహుల్ రెడ్డి(21), కొమ్ముల సాయి సుమంత్, భోగ్యం సాయికిరణ్‌గా తెలిసింది. ఈ ముగ్గురికి చెన్నైకి చెందిన అశోక్ అనే వ్యక్తి డబ్బులు ఆశ చూపడంతో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

SHARE

LEAVE A REPLY